కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలో ఈ ప్రకటన చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటించిన నటి కియారా అద్వానీ మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ మహిళా కథానాయికగా నటిస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. కియారా అద్వానీ తన సోషల్ మీడియా ట్విట్టర్లో త్వరలోనే కొత్త చిత్రం అప్డేట్ ఇవ్వబోతున్న ట్లు పోస్ట్ పెట్టారు. మేకర్స్ కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కియారా అద్వానీ చివరిగా తెలుగులో రామ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఆమె ఎన్టీఆర్ 30 తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. అధికారిక ప్రకటన త్వరలోనే తెలియనుంది.ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు తెలుస్తోంది.
Love you all.. exciting announcement soon
https://t.co/2aBLLfiQFn
— Kiara Advani (@advani_kiara) June 13, 2021