వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించి కరోనా సమయంలో ఆపద్బాంధవుడులాగా వచ్చి ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది సోను సూద్ అని ఎవరిని అడిగినా చెప్పుతారు. రియల్ లైఫ్ లో సూపర్ హీరోగా మారిన నటుడు సోను సూద్ అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్యలో నెగటివ్ రోల్ చేస్తున్నారు సోను సూద్. గత నెలలో సోను సూద్ ఈ చిత్రం కోసం కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసారు. ఇదిలావుండగా, బాలీవుడ్ ఛానెళ్లలో ఒకదానితో ఇటీవల జరిగిన వెబ్ ఇంటరాక్షన్ లో, ఆచార్యలో యాక్షన్ సన్నివేశం చేస్తున్నప్పుడు, చిరంజీవి తనను కొట్టడానికి నిరాకరించారని తెలిపారు, సోను సూద్ కొత్త ఇమేజ్ ను ప్రజలలో పరిగణించి తాను పంచ్ చేయలేనని చెప్పారు అని సోను తెలిపారు. దీని బట్టి సోను సూద్ యొక్క ఇమేజ్ చూసి హీరోలు కూడా తనని విలన్ గా ఊహించుకొలేకపోతున్నరు. ఇప్పుడు సోను సూద్ కి విలన్ పాత్రల కంటే, ఇప్పుడు చిత్రనిర్మాతల నుండి లీడ్ హీరో పాత్రలను అందుకుంటున్నట్లు సోను సూద్ వెల్లడించారు.