బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎంత మంచి స్వచ్ఛమైన మనస్సు అందరికి తెలిసిందే ఆదాయం ఎంత వస్తుంది అని విషయాన్ని పట్టించుకోకుండా అవసరమైన సమయాలలో నలుగురికి సహాయం చేయాలని తెలిసిన గోప్ప మనస్సు ఉన్న వ్యక్తి సంపూ. ఎందుకంటే ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలుసుకొని సంపూర్ణేష్ బాబు స్వయంగా ఆ పిల్లలను కలిశారు. రూ. 25 వేలు ఆర్ధిక సహాయం చేయడంతో పాటు దర్శక నిర్మాత సాయి రాజేష్ తో కలిసి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటున్నట్లు తెలియజేశారు.ఈ విషయాన్నీ సోషల్ మీడియా ట్విట్టర్లో తెలియజేశారు. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరు సంపూర్ణేష్ బాబును అలాగే డైరెక్టర్ సాయి రాజేష్ గారిని ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు బజారు రౌడీ, క్యాలీఫ్లవర్, పుడింగి నంబర్ వన్ చిత్రాలలో నటిస్తున్నారు.
దుబ్బాక లో నరసింహచారి గారి కుటుంబం లో జరిగిన ఈ వార్త చూసి గుండె కలిచివేసింది.
తల్లితండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను మరియు మా నిర్మాత @sairazesh అందిచడం జరిగింది. చదువు కు అయ్యే పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇవ్వటం జరిగింది. pic.twitter.com/g3emBWVpYd— Sampoornesh Babu (@sampoornesh) July 1, 2021