నాగార్జున డ్యుయల్ రోల్ లో 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచే ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని కూడా తీర్చిదిద్దుతున్నారు అని సమాచారం. అందులో నాగార్జున, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. అయితే ఇందులో నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటించబోతుంది. ‘మనం’ చిత్రం తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు.