నటి అనసూయ భరద్వాజ్ విన్నర్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పక్కన సుయా సుయా సాంగ్ అలాగే ఎఫ్ 2 లో వెంకటేష్ వరుణ్ తేజ్ తో డింగ్ డాంగ్ అనే ప్రత్యేక పాటలో డాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే ఇప్పుడు అనసూయ ఆర్ క్స్ 100 ఫేమ్ కార్తికేయతో చావు కబురు చల్లగా మూవీ లో స్పెషల్ సాంగ్ చేయనున్నారు.
అనసూయ మొదట్లో చావు కబురు చల్లగలోని స్పెషల్ సాంగ్ చేయడానికి నిరాకరించింది అని సమాచారం. ఎందుకంటే ఆమె ఇకపై ప్రత్యేక పాటలలో చేయకూడదు అని అనుకున్నారు అని సమాచారం. ఏదేమైనా, ఈ చిత్ర దర్శకుడు కౌశిక్ పెగల్లాపతి ఈ పాట గురించి అలాగే ఆమె పాత్ర కథకు ఎలా కీలకమో వివరిస్తూ ఆమెను ఒప్పించారు అని తెలుస్తుంది. చివరకు ఆమె చేయడానికీ ఒప్పుకున్నారు అంటా. ఈ పాట షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది జాని మాస్టర్ దీనిని కార్తికేయ, అనసుయాతో కలిసి కొరియోగ్రఫీ చేస్తున్నారు. అల్లు అరవింద్ ప్రెజెంటేషన్ కింద బన్నీ వాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.