మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి ఆనందీ తన ప్రియుడు కో డైరెక్టర్ సోక్రటీస్‌ను వివాహం చేసుకుంది. ఆమె వివాహం నిన్న తన స్వస్థలమైన వరంగల్‌లో జరిగింది. ఆనందీ తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రాచుర్యం పొందింది, ఇక్కడ ఆమెను ‘కాయల్’ ఆనందీ అని పిలుస్తారు. ఆమె కో-డైరెక్టర్ సోక్రటీస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ యువ ప్రేమికులు వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. సుమారు 15 తమిళ చిత్రాల్లో ఆనందీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆమె ప్రస్తుతం తెలుగు చిత్రం జోంబీ రెడ్డిలో నటిస్తుంది.
Parieryum Perumal actress Anandhi ties knot with #AgniSiragugal co-director Socrates pic.twitter.com/Y3f5T3mcac
— Rajasekar (@sekartweets) January 8, 2021