శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ చిత్రం లవ్ స్టోరీ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సంవత్సరం విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. ఈ చిత్రం పై ముందు నుంచి చాలా హైప్ ఉంది. అలాగే ఈ సినిమా కూడా అన్ని అంచనాలను చేరుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్లకు చేరుకుంది అని టాక్ వినపిస్తోంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన చిత్రాలలో మొదటి రోజు కలక్షన్స్ పరంగా చూస్తే ఇది ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చుస్తే ఇది భారీ మొత్తం అనే చెప్పుకోవాలి. మరో ప్రత్యేకత ఏంటంటే ఒక్క నైజాం నుంచి 3.5 కోట్ల షేర్ వచ్చింది అని సమాచారం. వీకెండ్ కావడంతో టికెట్ అమ్మకాలు రెండవ రోజు కూడా ఆక్యుపెన్సీ ఎక్కువగానే ఉంది అని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్లో ఈ సినిమా బిగేస్ట్ హిట్ గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర అధ్బుతంగా ఉండటంతో మరోసారి సాయి పల్లవి పేరు టాలివుడ్ మొత్తం మారుమోగిపోతోంది. బ్లాక్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది పెద్ద బూస్ట్ అనే చెప్పుకోవాలి. కరోనా కారణంగా ఎవరూ థియేటర్ కి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపని ప్రేక్షకులు ఈ చిత్రంతో మళ్ళి థియేటర్లో చూడటానికి ఇష్ట పడుతున్నారు అనడానికి నిన్న వచ్చిన కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది.