దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెండ్షిప్ సాంగ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేసారు. దోస్తీ పేరుతో వచ్చిన ఈ పాటను ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచారు అలాగే హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడలో 5 ప్రముఖ గాయకులు – అమిత్ త్రివేది, అనిరుధ్, విజయ్ యేసుదాస్, హేమ చంద్ర, యాజిన్ నిజార్ ఈ సాంగ్ పాడారు.
ఈ పాటలో స్నేహం గురించి భావోద్వేగంగా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరియు చరణ్ శక్తివంతమైన బ్రిటిష్‌ని ఎదుర్కొంటారు అని మేకింగ్ వీడియోలో చూసం. ఈ సాంగ్ ను అద్భుతంగా చిత్రీకరించిన కొరియోగ్రఫీ చేయబడిన పాట స్వరాన్ని సరిగ్గా సెట్ చేసింది. ఈ పాటతో ఈ సినిమా పై భారీ అంచనాలను ఒక ఎత్తుకు తీసుకెళ్లింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌లో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రకని, ఆంగ్ల నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ మరియు అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాను చేస్తున్నారు.
This Friendship day, witness the coming together of 2 powerful opposing forces – Ramaraju🔥& Bheem 🌊#Dosti Music Video: https://t.co/uK5ltoe7Fq@MMKeeravaani@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@TSeries @LahariMusic #RRRMovie #Natpu #Priyam
— rajamouli ss (@ssrajamouli) August 1, 2021