ప్రముఖ టాలివుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ మొత్తానికి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన రఘు కుంచే గారి సంగీతంలో మరో అద్భుతమైన సాంగ్ రాబోతుంది. బాల నటుడు సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్ ఇందులో నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలో “గుంటడు గుళ్లో కాస్తే’ అనే సాంగ్ విడుదల కాబోతుంది. రఘు కుంచె వినూత్న సింగింగ్ టాలెంట్‌లో మట్టిలోని మాణిక్యాని వెలికి తీసి పాడించిన పాట ఇది. పల్లె ముత్యం దశ లక్ష్మీ ఈ పాటను పాడింది. ఈ పాట ద్వారా లక్ష్మీ ను ప్లే బ్యాక్ సింగర్స్‌గా వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. అలాగే ఈ పాటకు గేయ రచయితగా గిరి అనే కొత్త వ్యక్తి పని చేసారు. ఈ చిత్రానికి సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మరో ‘పల్లె ముత్యం’ .. 🙂
Introducing ‘Dasa Lakshmi’
Gannora, Near Baasara,Telangana కి చెందిన ఈ పల్లె గాయని
నా రాబోయే BATCH Movie లో singer గా introduce అవుతుంది .
Voice లో Clarity, Energy, Raw Feel పుష్కలంగా ఉన్నాయ్. Industry గుర్తించగలిగితే గొప్ప singer అవుతుంది ఈ అమ్మాయి pic.twitter.com/sUlQwc7B5v— Raghu kunche 🇮🇳 రఘు కుంచే (@kuncheraghu) July 30, 2021