ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ మాటల రచయత ఎవరూ అంటే అందరు చెప్పే ఒకే ఒక పేరు బుర్రా సాయిమాధవ్ గారి పేరే వినిపిస్తోంది. అద్భుతమైన డైలాగ్స్ తో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకు వెళుతున్నారు. డైలాగ్ రైటర్ గా ఎలాంటి కథకైనా తన లోతైన మాటల్ని రాయడంలో ఆయకే సాటి అని నిరూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఆయన పంచన చేరుతున్నాయి. తాజాగా ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. అదే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న #RC15 మూవీ, దిల్ రాజు నిర్మాతగా చేస్తున్న ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ గా బుర్రా సాయిమాధవ్ ఫిక్స్ చెయ్యడంతో మెగా అభిమానులకు మరింత ఉత్సాహన్ని పెంచింది. ఒక్కప్పుడు జెంటిల్ మేన్ చిత్రం చూసిన బుర్రా సాయిమాధవ్ గారు అప్పుడు శంకర్ గారితో ఒక ఫోటో దిగితే చాలు అనుకున్నారు అంటా ఇప్పుడు స్వయంగా ఆయన చిత్రానికి డైలాగ్స్ రాయడం చాలా సంతోషంగా ఉంది అని సోషల్ మీడియా ట్విట్టర్లో ఈ పోస్ట్ ను పెట్టారు.
జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు
శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి
చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..
Thanks to Sankar sir..
Thanks to Dil Rajugaru.. and
Thanks to our
Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG— Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021