ఒక్కప్పుడు టిక్ టాక్ వీడియోలతో ఇప్పుడు ఇన్స్తా గ్రామ్ రీల్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగులతో స్పూఫ్ వీడియోలో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూ వుంటాడు. ఈసారి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో వీడియోను రిఫేస్ యాప్ లో చేసి మెగా అభిమానులకు మరింత వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు.