ఎస్ఆర్ కల్యాణమండపం ఆల్బమ్ నుండి నాల్గవ పాటను దర్శకుడు సుకుమార్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పాట లవర్ గురించి చక్కటి లిరిక్స్ తో చమత్కారంగా ఉంది. ఈ పాటకు సిగ్గేందుకు మామ అంటూ వచ్చే ఈ సాంగ్ ను రచయిత భాస్కర్ బట్ల యొక్క నవల సాహిత్యం ఇతివృత్తాన్ని అనుకరిస్తుంది. ఈ సాహిత్యం కి యువత బాగా కనెక్ట్ అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చైతన్ భరద్వాజ్ ట్యూన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా చేస్తున్నాడు. ప్రియాంక జావల్కర్ కధానాయిక గా నటిస్తుంది.