గత ఏడాది లాక్డౌన్ సందర్భంగా వేలాది మంది వలస కూలీలను తమ స్వస్థాలాలకు చేరుకోవడానికి నటుడు సోను సూద్ తన వంతు సాయంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా మెస్సీయగా మారిన నటుడు సోను సూద్. ఈ ఏడాది కూడా మరోసారి మెస్సీయగా అవతారం ఎత్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారు సోషల్ మీడియా ద్వారా తమ బాధను ట్విట్టర్ ద్వారా సోను సూద్ కి తెలియజేస్తున్నారు. వెంటనే స్పందిస్తూ వారికి కావలసిన సహాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ రోగులకు పడకలు, మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమైన వారికి ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం తన వంతు సాయం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వాల వైఖరిపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు కావలసిన సహాయాన్ని అందించలేకపోవడంపై నిస్సహాయత వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తనకి కరోనా పాజిటివ్ రాగా ప్రస్తుతం ఐ సోలేషన్లోనే చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
In 30 mins injections will be in your hand 🙏 https://t.co/ZNCAjV3khQ
— sonu sood (@SonuSood) April 20, 2021