గోపిచంద్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం సీటీమార్ లో స్టార్ హీరోయిన్ తమన్నా తెలంగాణ యువతిగా కబడ్డీ జట్టు కి కోచ్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ ను తమన్నా దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉండి చప్పిస్తున్నారు. నిన్న సంపత్ నంది ట్విట్టర్లో డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ పూర్తి చేయిస్తున్నట్లు తమన్నా చిత్రాన్ని ట్వీట్ చేశాడు. తెలుగులో డబ్బింగ్ అది కూడా తెలంగాణ యాసలో తమన్నా తో అని సంపత్ ట్వీట్ చేశాడు.
సీటీమార్ చిత్రానికి శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2 న విడుదల కానుంది. ఈ చిత్రంలోనీ పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.
And that’s a wrap!!!
Dubbing in Telugu, moreover, Telangana accent..@tamannaahspeaks nails it and how!
Breathing life into every cell of #JwalaReddy.. Kudos to her efforts 👏🏾@SS_Screens #SeetimaarrOnApril2 pic.twitter.com/KK7NLZdQBV
— Sampath Nandi (@IamSampathNandi) March 18, 2021