పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చాలా గ్యాప్ తర్వాత పవన్ రీ ఎంట్రీ తో వస్తున్న ఈ చిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రం అజ్ఞాతవాసి 2018జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి అభిమానులను అంతగా అలరించలేదు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ పరిస్థితులు సినిమా విడుదల కొద్దిగా ఆలస్యానికి కారణం అయింది. వచ్చే నెల ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. మార్చ్ 3న సాయంత్రం 5గంటలకు ‘సత్యమేవ జయతే’ లిరికల్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఈ సాంగ్ కి రచయితగా పనిచేసిన రామ జోగయ్య శాస్త్రి గారు ఈ పాటకి సంబంధించి లిరిక్స్ ను కోట్ రూపంలో విడుదల చేస్తూ ఈ సాంగ్ కి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తమన్ ఈ పాటకి గట్టిగా కొట్టాడు అని కామెంట్ కూడా చేసారు. దీనితో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, అనన్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నటి శృతి హాసన్ ముఖ్యపాత్రలో పోషిస్తోంది.
గత ఏడాది మహిళా దినోత్సవం కానుకగా ‘మగువా మగువా..’ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. సిధ్ శ్రీరామ్ పాడిన మగువా సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంది. కాగా వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది.
తమ్ముడు @MusicThaman ఈసారి ఇంకా ఘాట్టిగా కొట్టాడు
Love u once again dear
pic.twitter.com/UhLpFUTMcv
— RamajogaiahSastry (@ramjowrites) March 2, 2021
మా అందరి తరపున……
ప్రేమతో మీఅందరికోసం ..Glimpse of SatyamevaJayathe
Thanku #SriramVenu @MusicThaman @SVC_official
Few more hours plz
pic.twitter.com/9Dbau0qta5
— RamajogaiahSastry (@ramjowrites) March 3, 2021
Until 5 O Clock..
Lets celebrate this….#SatyaMevaJayathe
Thanku #Sriramavenu @MusicThaman @SVC_official pic.twitter.com/iBaYTaKesV
— RamajogaiahSastry (@ramjowrites) March 3, 2021