నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది. ఎక్కువ రోజుల షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఈ షెడ్యూల్లో హీరో నానితో పాటు ప్రధాన తారగణం పాల్గొంటుంది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న ఉప్పెన ఫేమ్ నటి కృతి శెట్టి నిన్న తన హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం ఉప్పెన మూవీ నిన్న దేశ వ్యాప్తంగా విడుదల అయ్యిన విషయం తెలిసిందే. తను ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ కోసం అని కోల్‌కతా వెళ్ళారు. అయితే హీరో నాని గారు అండ్ చిత్ర బృందం కలిసి ఉప్పెన మూవీ కి వెళ్లినట్టు పోస్ట్ పెట్టారు నటి కృతి శెట్టి. నాని కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నటి కృతి శెట్టి.
ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు.
Thank you soooo much @NameisNani garu for special screening of Uppena at Kolkata for me and the cast and crew of SSR♥️ thank you so much for your sweet gesture😊I loved it and will be a memorable thing forever 🙏✨ pic.twitter.com/MjQ6nsYv1O
— KrithiShetty (@IamKrithiShetty) February 13, 2021