బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు అంటే పెద్ద హీరోల అభిమానులు అందరూ సంపూ ను ఎంతగానో ఇష్టపడతారు. ఎందుకంటే ఆతని నటన కి అలాగే మంచి మనస్సు ఉన్న హీరో గా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. హృదయకాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు సంపూర్ణేశ్‌బాబు. లాక్‌డౌన్ కాలంలో కొద్దిగా సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమాలు చేస్తున్నారు. సంపూ ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. సంపూ నటిస్తోన్న కొత్త చిత్రం సంపూ5 రేపు ఫస్ట్ లుక్ అలాగే మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సంబరాలతో దద్దరిల్లిపోవాలి రేపు అంటూ పోస్టులు పెడుతున్నారు సంపూ అభిమానులు.
రేపే మొదటి లుక్ pic.twitter.com/khgQtStmDO
— Sampoornesh Babu (@sampoornesh) February 9, 2021