యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే కలిసి నటించిన పాన్ ఇండియన్ చిత్రం రాధే శ్యామ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రొమాంటిక్ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వి ఎఫ్ క్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటోంది. వేసవిలో ఈ చిత్రం తెరపైకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాధే శ్యామ్ నిర్మాతలు జూలై 12 న ఈ చిత్రం విడుదల తేదీగా లాక్ చేశారు అని సమాచారం. పాన్ ఇండియన్ రిలీజ్ కనుక ఈ చిత్రం పై మరింత జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు అని తెలుస్తుంది. ఈ విడుదల తేదీ ప్రకటన గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు భాగ్యశ్రీ, మురళి శర్మ, సచిన్ ఖేడేకర్, కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కృష్ణరాజు గారు అతిధి పాత్రలో కనిపించనున్నారు. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ నిర్మాతలు. రాధే శ్యామ్ కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతం నేపథ్య స్కోర్ కంపోజ్ చేస్తున్నారు.