స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దర్శకుడుగా మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల పవన్‌ను కలిశారని పవన్‌కు తన చిత్రం యొక్క కథ లైన్ వివరించారని వార్తలు వచ్చాయి. అయితే పూర్తి స్క్రిప్ట్‌ను వివరించమని పవన్ జానీని కోరినట్లు అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు, జానీ మాస్టర్ తన ట్వీట్ ద్వారా తను జీవితంలో మరో అడుగు ముందు కేస్తునట్లు ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ హీరోగా ఒక సినిమాను సైన్ చేసినట్లు తెలుస్తోంది. అవును జానీ మాస్టర్ హీరోగా అరంగేట్రం చేయనున్న ఈ చిత్రానికి ఒక యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ 2021 ప్రారంభం కావచ్చు అని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Taking the Next level step in my Life 😇 Interesting Announcement ahead 🥳 Need all your blessings 🙏
— Jani Master (@AlwaysJani) December 28, 2020