మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్’కు దర్శకుడు ఖరారు చేసారు మెగా స్టార్ చిరంజీవి గారు. మలయాళంలో పెద్ద హిట్ అయిన లూసిఫెర్ చిత్రానికి రీమేక్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి చివరకు, ఈ రోజు దర్శకుడుని ఖరారు చేసారు. తమిళంలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజాకు దర్శకుడి బాధ్యతలు అప్పగించారు. చిరంజీవి స్వయంగా మోహన్ రాజా పేరును ప్రకటించారు. మోహన్ రాజా ఈ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దానున్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ, నేను చిరంజీవి గారి హిట్లర్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని, మళ్లీ ఇప్పుడు చిరంజీవి గారికి దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం నాకల ఇప్పుడు నా కల నెరవేరేబోతుంది అని చెప్పారు దర్శకుడు మోహన్ రాజా.
ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#MegaStar153 #Lucifer movie Telugu remake will be directed by @Jayam_Mohanraja and jointly produced by @KonidelaPro & NVR Cinema.
#MegaStar @KChiruTweets will join the sets after Sankranthi 2021. pic.twitter.com/r5t0ZiuWo9
— Konidela Pro Company (@KonidelaPro) December 16, 2020
With the blessings of my parents and well wishers, life has always gifted me better and bigger things.
And this time I’m more elated n honored to direct a mega project with the Megastar @KChiruTweets himself 🙏😇
Need all your wishes n prayers 🙏 #Chiru153 pic.twitter.com/d2uhQIGOpy— Mohan Raja (@jayam_mohanraja) December 16, 2020