మెగా కుటుంబలో నిహారిక పెళ్లి సందడి మొదలైంది. నిహారికా పెళ్లి ఈ నెల డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ వద్ద చైతన్య జోన్నలగడ్డతో పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఈ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా కుటుంబీకులు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో నిహారికా, చైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు వెంకటేష్ మరియు అతని భార్య, అల్లు సిరిష్, సుష్మిత మరియు ఆమె భర్త, శ్రీజా మరియు ఆమె భర్త కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ మరియు ఇతర బంధువులు అలాగే సన్నిహితులు ఉన్నారు. ఈ పెళ్లి కి సినీ ప్రముఖులు అలాగే మెగా కుటుంబం అంతా హాజరు కానున్నారు.