ఎస్ ఎస్ రాజమౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మల్టీ-స్టార్, ఆర్ఆర్ఆర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న షూట్ ప్రారంభించిన తరువాత, ఈ రోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు ఈ ఉదయం 10:30 గంటలకు షూటింగుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు.
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ అక్టోబర్ 22న వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ టీజర్ గురించి అభిమానలకు భారీ అంచనాలు హైప్ చాలా పెద్దవిగానే ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షూటింగ్ మేకింగ్ వీడియోలో రామ్ చరణ్ గుర్రం మీద ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ మీద రావడం ఈ చిత్రం మీద మరింత ఆసక్తి నెలకొంది.
ఆర్ఆర్ఆర్లో ఈ చిత్రంలో రామ్ చరణ్, అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు పలువురు ఇంగ్లీష్ నటులు ఉన్నారు. 400 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టును డివివి దానయ్య నిర్మిస్తున్నారు.