నటి కాజల్ అగర్వాల్ త్వరలో పీటలు ఎక్కుబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తన ఇన్స్తా గ్రామ్ లో లవ్ పిక్ పోస్ట్ పెట్టారు. తను చేసుకోబోయే వ్యక్తి ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు అని సమాచారం. వీరిద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో తెలుస్తోంది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారం మేరకు ఈ నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. అయితే గతంలోనూ ఆమె వివాహంపై అనేకమార్లు పుకార్లు రాగా వాటిని కొట్టిపారేశారు విషయం తెలిసిందే. కాజల్ పెళ్లి వార్త విని తెలుగు ప్రేక్షకులు కొద్దిగా ఫీల్ అయ్యినట్టు కనిపిస్తుంది వారి కామెంట్స్ చూస్తుంటే. లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. టాలీవుడ్ అగ్ర నటులు అందరితో ఆమె కలిసి నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020