ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఎస్పీ చరణ్ నాన్న గారి ఆరోగ్యం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తువస్తున్నారు. కొద్ది రోజులుగా బాలు గారి ఆరోగ్యం నిలకడ ఉందని ఎస్పీ చరణ్ చెప్పడం జరిగింది అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ఇప్పుడు బాలు గారి ఆరోగ్యం ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఇప్పుడు ప్రకటన విడుదల చేశాయి. మళ్లీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బాలు గారు తిరిగి తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు సినీ ప్రముఖులు అలాగే అభిమానులు.
ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Health bulletin on Thiru S P Balasubrahmanyam, as on September 24 2020, 6:30 PM IST#MGMHealthcare #SPBalasubrahmanyam pic.twitter.com/fLAAtH074h
— MGMHealthcare (@MGMHealthcare) September 24, 2020