అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేజర్ మహేష్ బాబు ప్రొడక్షన్స్ జీఎంబి ఒకటి కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం పై 26/11 దాడుల సమయంలో హీరోగా ఉన్న మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం మేజర్ ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగు భాషలలో ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కధానాయిక కోసం కొత్తగా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ తీసుకున్నట్లు సమాచారం. ఈమె బాలీవుడ్ నటుడు, చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్ కుమార్తె. సాయి మంజ్రేకర్ సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ 3 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు, ఇప్పుడు ఆమె మేజర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె సెట్స్ పైకి వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యే మేజర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో శోభితా ధులిపాల మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్, మహేష్ బాబు యొక్క జీ ఎం బి ఎంటర్టైన్మెంట్ మూవీస్ యొక్క జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ లొ ఈ చిత్రం రూపొందింది. శశి కిరణ్ టిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2021 లో సమ్మర్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు.