బిచ్చగాడు 2016 లో విడుదలైన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బారి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి మళ్లీ బిచ్చగాడు 2 తీస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ ఆంటోనీకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి అభిమానులు ఉన్నారు. ఆయన ఇటీవలే బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్ ప్రకటించారు, ఇది ఒకేసారి తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించబడుతుంది. విజయ్ ఆంటోనీ ట్విట్టర్‌లో తెలుగులో ట్వీట్ చేసి తన తెలుగు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆ ట్వీట్ లో “నాపై ఆధారపడిన నిర్మాతలు, దర్శకులు మరియు సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకుని నేను రేపు నుండి షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాను” అని విజయ్ చెప్పారు. తాను అన్ని భద్రతా జాగ్రత్తలు పాటిస్తానని, అంతా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం, విజయ్ ఆంటోనీకి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి అని తెలుస్తోంది.
నన్ను నమ్ముకున్న నిర్మాత దర్శక మరియు సినీ కార్మిక సోదరుల శ్రేయస్సున్ని
ఆకాంక్షిస్తూ …నేను రేపటి నుండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ లో పాలుగొనబోతున్నాను…..
అంతా మంచే జరుగుతుందని
ఆశిస్తూ…
నేను….మీ
(విజయ ఆంటోని)— vijayantony (@vijayantony) September 3, 2020