పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు తన పుట్టినరోజును జరుపుకోనున్నారు అలాగే అభిమానులు పవన్ నటించిన కొత్త చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే అతని మూడు సినిమాల నుండి ఉదయం నుండి ఒకదాని తరువాత ఒకటిగా విడుదల చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన తరుపున ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు ట్విట్టర్ లో #HBDPawanKalyan యాష్ టేగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
అతని పుట్టినరోజును అభిమానులు జరుపుకునే విధానాన్ని చూస్తే ఆయనకు ఎలా అనిపిస్తుంది అని అడిగినప్పుడు. దానికి సమాధానంగా తనను చాలా మంది అభిమానిస్తున్నారు అని తన పుట్టినరోజును వాళ్ళ పుట్టిన రోజులాగే జరుపుకుంటున్నారని చెప్పారు. ఇంత ప్రేమను ఇచ్చే అభిమానులకు జన సైనికులకులకు నా తరుపున వారికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని. తన హృదయం చాలా ఆనందంతో నిండిపోయిందని పవన్ అన్నారు.
రేపు వకీల్ సాబ్ చిత్రం నుంచి టీజర్ కానీ, మోషన్ పోస్టర్ కానీ విడుదల చెయ్యబోతున్నారు ఈ చిత్రం నిర్మాతలు. అలాగే హరీష్ శంకర్, క్రిష్ దర్శకత్వంలో రాయబోయే చిత్రాలు నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి.