ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కొద్ది రోజులుగా ఐసియుకు తరలించబడిన విషయం తెలిసిందే అయితే డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది అని ఇప్పటికే సమాచారం తెలియచేశారు బాలు కుమారుడు చరణ్. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌లో హాస్పిటల్ లో కోలుకుంటున్నారని వెల్లడించారు.
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ బాలు గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, తమిళంలో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో, రజినీ లెజెండరీ సింగర్ పట్ల ఆందోళన వ్యక్తం చేసి, త్వరలోనే ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నారు.
చాలా మంది అభిమానులు ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరగా సాధారణస్థితికి రావాలని ఆశిస్తున్నారు.
Get well soon dear Balu sir pic.twitter.com/6Gxmo0tVgS
— Rajinikanth (@rajinikanth) August 17, 2020