ఎప్పుడు ఎప్పుడా అని అనుకున్న హీరో రానా పెళ్లి ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నరు. దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి వాతావరణం నెలకొంటుంది. సురేష్ బాబు రానా వెంకటేష్ కలిసి తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. రానా ట్విట్టర్ అలాగే ఇన్స్తా గ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేసి రెడీ అంటూ పోస్ట్ పెట్టారు.
ఈ వివాహం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరగనుంది. వివాహానికి 30 మందికి మించి ఉండరు అని సమాచారం కేవలం కుటుంబానికి సంబంధించిన వారు అలాగే సన్నిహితులు పరిమిత సంఖ్యలో ఈ వివాహం చేసుకోనున్నారు రానా మిహీక . ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్- 19 కేసులు అధికంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వేడుక ద్వారా ఎవరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలని కోరుకోవడం లేదు అని దగ్గుబాటి ఫ్యామిలీ ముందుగానే చెప్పారు. ఈ రోజు సోషల్ మీడియాలో రానా మిహీక పెళ్లి ఫోటోలు ట్రెండింగ్ లోకి రావడం కాయం.