లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ లు ఇప్పుడిప్పుడే జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతానికి పైగా పూర్తి చేసుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2, కరోనా లాక్డౌన్ కారణంగా కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ నిలిచిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొంది.తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం షూటింగ్‌ను ఆగస్టు 15 న తిరిగి ప్రారంభించాలని చిత్ర బృందం యోచిస్తోంది అని సమాచారం. ఇంకా ఈ చిత్రానికి 25 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా ఈ చిత్ర బృందం దానిని చాలా త్వరగా ముగించాలని అనుకుంటుంది. యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి ప్రముఖ పాత్రల్లో నటించిన కెజిఎఫ్ 2 దాసర పండుగ సీజన్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అప్పట్లోకి ఈ కరోనా వాక్సిన్ వచ్చి థియేటర్ లు ఓపెన్ అయితే అభిమానులకు కన్నుల పండుగ అనే చెప్పుకోవాలి.