ఈ లాక్ డౌన్ సమయంలో సహాయక చర్యలలో సోను సూద్ ముందుకు వచ్చి తన వంతు సాయం చేస్తూ ఉన్నారు, వేరే ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వలస కార్మికులకు అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు తన వంతు కృషి చేసిన సోను సూద్ నిజ జీవితం లో హీరోగా ఎదిగారు. పేద కుటుంబం చెందిన వ్యక్తులను వాళ్ళ ఇళ్లకు చేరుకోవడానికి అతను ప్రత్యేక బస్సులు, రైళ్లు అలాగే విమానాల ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం తిరుపతి కి చెందిన రైతు కు ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇచ్చి ఆ రైతును ఆదుకున్న సోను సూద్ ఇప్పుడు అందరూ తననీ తెర మీద విలన్ తెర వెనుక హీరో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు సోను సూద్ అభిమానులు. ఈ రోజు సోను సూద్ 47 వ పుట్టినరోజున సందర్భంగా ఇండియా మొత్తం ఆయనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్ లో #HBDRealHeroSonuSood యాష్ టేగ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
రియల్ హీరో సోను సూద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Thank you so much sir. Your wishes made my day so so special. Keep encouraging sir, let’s make this world a better place to live in 🙏 https://t.co/bUIaFKnNfC
— sonu sood (@SonuSood) July 30, 2020
Thanks a ton my brother ❤️ https://t.co/Om1UfOSD7e
— sonu sood (@SonuSood) July 30, 2020