డైరెక్టర్ రాజమౌలి ట్విట్టర్ ద్వారా, తనకి కోవిడ్ టెస్ట్ లో వారికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వారికి స్వల్ప జ్వరం వచ్చింది అని అది స్వయంగా తగ్గినప్పటికీ ఎందుకన్న మంచిది అని పరీక్షలు చేయుంచుకోగా పాజిటివ్ అని తేలింది అని చెప్పారు. వైద్యులు సూచించిన విధంగా ఇంటి నిర్బంధంలో ఉన్నాము తెలియజేశారు. అయితే అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తున్నారని రాజమౌళి అన్నారు. మా ప్లాస్మాను దానం చేయడానికి మేము వేచి ఉన్నాము అని రాజమౌలి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు అలాగే అభిమానులు రాజమౌళి అలాగే కుటుంబ సభ్యులు తొందరగా కోలుకుని రావాలని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
My family members and I developed a slight fever few days ago. It subsided by itself but we got tested nevertheless. The result has shown a mild COVID positive today. We have home quarantined as prescribed by the doctors.
— rajamouli ss (@ssrajamouli) July 29, 2020