సరిగ్గా ఈదే తేదీన (జూన్ 15) 1995 లో విడుదలైన మోహన్ బాబు, రజనీకాంత్ కలిసి నటించిన పెదరాయుడు ఈ రోజు తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఆధ్వర్యంలో మోహన్ బాబు నిర్మాణం లో చేసిన ఈ చిత్రానికి కోటి సంగీతంతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
పెదరాయుడు 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా, హీరో మంచు విష్ణు సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా పెదరాయుడు మూవీ కి సంబంధించిన మేకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఎన్‌టి రామారావు గారు, దాసరి నారాయణ రావు గారు, కె. రాఘవేంద్రరావు గారు ఉన్నారు.