మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ఒకే నెలలో మార్చి 25 మార్చి 26 తేదీల్లో ట్విట్టర్‌లో చేరారు. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజున చిరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు అదేవిధంగా, చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు.
ప్రస్తుతం, చిరు అలాగే చరణ్ యొక్క ట్విట్టర్ ఖాతాలు గత రెండు నెలల్లో అర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చిరంజీవి గారి హ్యాండిల్‌లో 509.6కె ఫాలోవర్లు ఉండగా, చరణ్ ప్రస్తుతం 507.5 కె ఫాలోవర్స్‌తో అతనిని అనుసరిస్తున్నారు. అయితే చిరు ఎవరిని ఫాలో కావడం లేదు. చరణ్ మాత్రం చిరంజీవి గారిని అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ నీ ఫాలో అవుతున్నారు.
అయితే చిరు ట్వీట్లు తరచుగా తన పాతకాలపు జ్ఞాపకాలను అలాగే కోవిడ్-19 పై అవగాహన పెంచే ట్వీట్లు పెడుతూ ఉంటారు.మరోవైపు, చరణ్ కూడా అప్పుడప్పుడు ఈ మహమ్మారి కరోనా గురించి అనుసరించాల్సిన అవసరమైన భద్రతా చర్యల గురించి ట్వీట్ చేస్తారు.ఇప్పుడు వరకు చరణ్ 18 ట్వీట్స్ చేయగా చిరు 113 ట్వీట్స్ చేశారు. మరి కొన్ని నెలల్లోనే ఇద్దరు వన్ మిలియన్ ఫాలోవర్స్ ను చేరుకోవచ్చు.