Site icon syeraa

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విడుదల తేదీ 13-10-2021

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది.
రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్న సినిమా. విడుదల తేదీ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తు వుంటే ఈ చిత్రం పై మరింత హైప్‌ను పెంచుతుంది. అయితే ఈ చిత్రం విడుదలకు రైడ్ సిద్ధంగా ఉందని తెలిపారు చిత్ర బృందం.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్‌ గా అలియా భట్‌ అలాగే ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ హీరోయిన్‌ ఒలివీయా మోర్రీస్‌ నటిస్తుంది. అజయ్ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version