Site icon syeraa

అజయ్ దేవగన్ శ్రియా శరణ్ తో జత కట్టనున్నరా?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్ కీలక పాత్రకు సంబంధించిన షూటింగ్ లాక్డౌన్కు ముందు షెడ్యూల్లో తన షూట్ యొక్క ప్రధాన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ బృందం నుంచి ఆయనకు మరో సారి ఆత్మీయ స్వాగతం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కోసం నటుడు అజయ్ దేవగన్ మరోసారి హైదరాబాద్ రానున్నారు. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని భాగాలను అజయ్ దేవ్‌గన్ తో చిత్రీకరించనున్నారు చిత్ర బృందం. అజయ్ దేవ్‌గన్ నటి శ్రియా శరణ్ తో ఆర్‌ఆర్‌ఆర్ ఇద్దరూ జత కట్టనున్నారు. వీరిద్దరూ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లకు సంబందించిన పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. నటి అలియా భట్ కూడా డిసెంబర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సెట్స్‌లో చేరనున్నారు. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేయాలని భావిస్తోంది ఈ చిత్రం బృందం.

Exit mobile version