Site icon syeraa

పవర్ స్టార్ తో దిల్ రాజు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు తర్వాత పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఉద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ మీద ఇచ్చిన ప్రసంగం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరిగి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో అలాగే ప్రముఖ వెబ్ సైట్లు బాగా వినిపిస్తోంది. అయితే ఇంకా ఎటువంటి అఫిషియల్ స్టేట్మెంట్ అనేది. దిల్ రాజు మరోసారి పవన్ కళ్యాణ్‌ను సంప్రదించినట్లు మరో చిత్రం నిర్మించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు అని సమాచారం. పవన్ కళ్యాణ్ తో రెండో ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అనేది ఇంకా ఎటువంటి సమచారం లేదు. కరోనావైరస్ యొక్క రెండవ వేవ్ కారణంగా ఈ చిత్రం తన థియేట్రికల్ రన్ అకస్మాత్తుగా ముగించాల్సి వచ్చినప్పటికీ, ప్రముఖ నిర్మాత వకీల్ సాబ్ ద్వారా భారీ లాభాలను ఆర్జించాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరలో అయ్యప్పనమ్ కోషియం రీమేక్ మరియు క్రిష్ తో హరి హర వీర మల్లు చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. అదే విధంగా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలకు ఆయన సంతకం చేశారు. పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు చిత్రం 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో ప్రారంభమవుతుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Exit mobile version