పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాలు తరువాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి రాత్రి షెడ్యూల్ తో షూట్ ను తిరిగి ప్రారంభించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లు పవన్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సన్నివేశాలు వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుత షెడ్యూల్ ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది అని సమాచారం. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి మరియు అనన్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూట్ మొత్తం నవంబర్ నాటికి పూర్తి అవుతుందని సమాచారం. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి 2021 న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ మొదలైంది
