Site icon syeraa

నేడే నితిన్ మాస్ట్రో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి ప్రదర్శన ఇచ్చాడని దర్శకుడు గాంధీ ఒక ప్రత్యేక ఇంట్వ్యూలో అన్నారు. హిందీలో నటి టబు చేసిన పాత్రలో తెలుగులో తమన్నా నటించడం తన ఎంపిక కరెక్ట్ అని గాంధీ చెప్పారు. ఇందులో మరో హీరోయిన్ గా నభ నటేష్ నటిస్తుంది. తెలుగు వారికి తగ్గట్టుగా క్లైమాక్స్ కొద్దిగా మార్చబడ్డాయి అని గాంధీ అన్నారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతుంది. ఈ రీమేక్‌ని ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారో చూడాలి.

Exit mobile version