Site icon syeraa

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రం టైటిల్?

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి 11 సంవత్సరాలు తరవాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రావడం పై మహేశ్ అభిమానులకు మరింత హైప్ పెరిగింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రంపై అభిమానులే కాకుండా అందరి దృష్టి ఉంది. అతడు అలాగే ఖలేజా తర్వాత వీరిద్దరూ ఒకరితో ఒకరు చేతులు కలపడం టాలీవుడ్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి ‘పార్ధు’ అని పేరు పెట్టారని బాగా వినిపిస్తోంది. ఇది అతడు లో మహేష్ పాత్ర పేరు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరుగుతుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపందుతోంది.

Exit mobile version