విలక్షణ నటుడు హీరో జగపతి బాబు గారు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన నటన కు ఇండియా మొత్త ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే నిన్న జగపతిబాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమా వేడుకల్లో టిక్ టాక్ స్టార్ దుర్గారావు జగపతి బాబు గారికి పెద్ద అభిమానిని ఆయన తో ఒక్కసారి డాన్స్ చేయాలని కోరిక ఉండేదని చెప్పుతూ జగపతి బాబు గారిని ఒక్కసారి నాతో డాన్స్ చేస్తారా అని అడిగిన వెంటనే జగపతి బాబు స్టేజ్ మీదికి రావడమే కాదు. అతని కోరికను కాదనకుండా అతనితో కలిపి స్టెప్పులు వేశారు. ఈ అవకాశం ఇచ్చిన హీరో జగపతి బాబు గారికి చిత్ర యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు టిక్ టాక్ స్టార్ దుర్గారావు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వేడుకకు సోషల్ మీడియా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో ఈ చిత్రంలోని సాంగ్స్‌ని లాంఛ్ చేయించారు హీరో జగపతి బాబు.
టిక్ టాక్ దుర్గారావు తో స్టెప్స్ వేసిన హీరో జగపతి బాబు
