Site icon syeraa

అయ్యగారే నెం .1 అని ప్రశంసిస్తూన్న అభిమాని గురించి అఖిల్ ఏమన్నారు

యంగ్ హీరో అఖిల్ అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోలలో ఒకరు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించడానికి కొంత సమయం కేటాయించారు.

ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో, అఖిల్ ను తన అభిమానిని గురించి ఒకరు అడగగా తను సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా జవాబు ఇచ్చారు. నేను అతని వీడియోలు చూశాను. నా ఒక అభిమాని ఇంత పాపులర్ అయ్యాడని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ట్రోల్స్ గా మొదలైన ఈ వీడియో ఇప్పుడు సానుకూల రూపాన్ని సంతరించుకుంది అని అన్నారు. అతను చాలా పాపులర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను అని ప్రస్తుతానికి, అతను నాకన్నా ఎక్కువ పాపులర్ అయ్యాడు. నేను అతడిని ఒకసారి కలవాలనుకుంటున్నాను అని అన్నారు. దయచేసి మీరు ఎక్కడా ఉన్న సురక్షితంగా ఉండండి తనకీ ఎప్పుడూ మద్దతు ఇవ్వండి అని అఖిల్ అన్నారు. అఖిల్‌ను ‘అయ్యా గారూ’ అని పిలిచి, ‘అయ్యగారే నెం .1’ అని ప్రశంసిస్తూ ఈ ప్రత్యేక అభిమాని పాపులర్ అయ్యాడు. అఖిల్ తన కొత్త సినిమా విడుదల సమయంలో అతని వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.

Exit mobile version