Site icon syeraa

విద్యార్తి చిత్రం టీజర్ విడుదల – ప్రేమ కోసం ఒంటరి పోరాటం

విద్యార్తి చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు ఈ చిత్ర బృందం. ఈ టీజర్లో చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తాన్ని ప్రదర్శిస్తుంది – కుల రాజకీయాలు సమాజంలో సామాజిక ఉదాసీనత గురించి తెలియజేస్తుంది ఈ టీజర్ ను చూస్తే.

ఈ చిత్రానికి హీరోగా రాజు గారి గది చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించిన చేతన్ చీను, టిక్ టోక్ ఫేమ్ బన్నీ వోక్స్ (వర్షినీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్ తో కథానాయకుడి న్యాయం గురించి సమానత్వం కోసం పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

విద్యార్తి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ మరియు అరకులలో చిత్రీకరించారు. అల్లా వెంకట్ యాజమాన్యంలోని మహాస్ క్రియేషన్స్ రెజెటి రామకృష్ణ, వంశీ తడికొండల సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలిసారిగా మధు మదాసు దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది సమాచారం.

Exit mobile version