Site icon syeraa

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఖిలాడి చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ‌లు హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రంలో అనసూయ, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌‌కి మంచి రెస్పాన్స్ రాగా, కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మూవీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమా పై రవి తేజ అభిమానులకు భారీ అంచానాలున్నాయి.

Exit mobile version