Site icon syeraa

ప్రేమలో పడటం బాధాకరమైన ఆనందం “మను చరిత్ర”

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మను చరిత్ర’ నుంచి ఈ రోజు టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో హీరోని చూపించిన విధానం చుస్తే ఈ చిత్రంలో శివ కందుకూరి నటన డైలాగ్స్ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమణి కధానాయికగా నటించగా అలాగే ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు అలాగే యాపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి అలాగే పి రాన్‌సన్ జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ పోస్టర్ పై కాజల్ అగర్వాల్ ప్రెజెంట్స్ అని వేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Exit mobile version