Site icon syeraa

ఆచార్య లో సిద్ధ సగా టీజర్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్రం నుంచి మేకర్స్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. సిద్ధాస్ సాగా అనే టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్ చూస్తుంటే గుజ్బుంబ్స్ రావడం ఖాయం. తండ్రీకొడుకులను ఒక ప్రేమ్ మీద చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదు. మెగా అభిమానులకు ఈ టీజర్ సరి కొత్త ఉత్సాహం నింపింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఆచార్యలో చిరంజీవి మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్‌ డ్రామాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ దీనిని నిర్మించాయి.

Exit mobile version