Site icon syeraa

బిగ్ బాస్ ఐదవ సీజన్ హోస్ట్ పై నెలకొన్న సందిగ్ధత?

తెలుగులో మోస్ట్ రియాలిటీ షో అంటే అది బిగ్ బాస్ తెలుగు షో అనే చెప్పుకోవాలి. ముందు నాలుగు సీజన్స్ విజయవంతంగా ప్రేక్షక ఆదరణ పొందాయి. అయితే మహమ్మారి కారణంగానే బిగ్ బాస్ ఐదవ సీజన్ కూడా ఆలస్యం అయింది.. ఇప్పుడు బిగ్ బాస్ యొక్క ఐదవ సీజన్ గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. నాలుగో సీజన్‌కు హోస్ట్ గా ఆతిథ్యమిచ్చిన టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున ఇప్పుడు ఐదవ సీజన్ చేస్తున్నారా లేదా అనే సందిగ్ధత అయితే నెలకొంది. ఐదవ సీజన్ హోస్ట్ కోసం కొంత సంసిద్ధత అయితే కొనసాగుతుంది. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఇప్పుడు బిగ్ బాస్ 5 కోసం చర్చలు జరుపుతున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు మేకర్స్ రానాను సంప్రదించినట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రానా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తుంది. రానా ప్రస్తుతం జెమినిలో నెం 1 యారి చేస్తున్నారు. యారి నెం 1 సీజన్‌ కూడా మంచి విజయవంతమైంది. రానా దగ్గుబాటి యొక్క హోస్టింగ్ నైపుణ్యాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ మా ఇప్పుడు బిగ్ బాస్ 5 కోసం రానాను సంప్రదించింది అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మీడియా ఛానల్ లో ఈ సీజన్ కూడా నాగర్జున గారు చేస్తున్నారు అని చెపుతున్నారు. చూడాలి ఎవరు సీజన్ 5 ను హోస్ట్ చేస్తున్నారో త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం పోటీదారులు కోసం సంప్రదింపులు చేస్తున్నారు. బిగ్ బాస్ 5 ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది.

Exit mobile version