Site icon syeraa

మీ ఇద్దరికీ మేము రుణపడి ఉన్నాము – చిరంజీవి

గత రెండు నెలలుగా తమ ప్రాణాలను పణంగా పెట్టి,కరోనావైరస్ తో ధైర్యంగా పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ హృదయపూర్వక నివాళిగా, భారత వైమానిక దళం నేడు హెలికాప్టర్ల నుండి దేశంలోని పలు ఆసుపత్రులలో గులాబీ రేకులను కురిపించింది. గాంధీ హాస్పిటల్ సిబ్బందిపై ఎయిర్ ఫోర్స్ ఛాపర్స్ ద్వారా గులాబి పూల రేకులు కురిపించే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా భారతీయ వైమానిక దళం మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులను ప్రశంసించారు, వారిని ట్రూ హీరోస్ అని పిలిచారు. సరిహద్దు వద్ద శత్రువులతో పోరాడే ఫ్రంట్‌లైన్ యోధులుగా చిరు వైమానిక దళాన్ని అభివర్ణించగా, ఆరోగ్య నిపుణులను వైరస్‌తో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ యోధులుగా ఆయన ప్రశంసించారు. మీ ఇద్దరికీ మేము రుణపడి ఉన్నాము! జై హింద్! అని చిరు ట్వీట్ చేశారు.

Exit mobile version