Site icon syeraa

కాస్కో నా రాజా ఐపిఎల్ మీద కాదు మా ఎలక్షన్స్ మీద?

ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా ఉన్న అంశం మా ఎలక్షన్స్ ప్రతిష్టాత్మక మా ఎన్నికలు రేపు ఉదయం 8నుంచి జరగనున్నాయి. రసవ్తరంగా సాగుతున్న ఈ ఎన్నికలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ అలాగే మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడుతోంది. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు మధ్య మీడియాలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ మొత్తం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఎన్నికల్లో విజయం సాధించే ప్యానెల్ గురించి భారీ పందాలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. ప్రెసిడెంట్ పదవి నుండి ఇతర పదవుల వరకు ఎవరూ విజియాన్ని వరుస్తుందోనని భారీ పందాలు జరుగుతున్నాయి అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సెలబ్రిటీలలో కొందరు లక్షలకు బెట్టింగ్ వేసుకుంటున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి టాలీవుడ్లో. ముందు వరకు, ప్రకాష్ రాజ్ విజయం తథ్యం అని అందరూ ఊహించారు కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విష్ణు గట్టి పోటీదారుగా మారారు అలాగే మెజారిటీ 50 ఓట్లను మించదని అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి రేపు ఉదయం అనగా ఆదివారం 8 నుంచి 2వరకు ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు కూడా రేపు సాయంత్రం ప్రకటించబడతాయి. ప్రస్తుతం అందరి దృష్టి మా ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఈ పందాలు ఐపిల్ పందాలు మించి పోయాయని తెలుస్తుంది.

Exit mobile version