Site icon syeraa

సాయిధరమ్ తేజ్ ను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలింపు

ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హీరో సాయిధరమ్ తేజ్‌ గాయపడ్డారు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఐకియా వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తన సొంత స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. తలకు హెల్మెట్ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడునట్లు తెలుస్తోంది. ఆయన్ను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనసేన అద్యక్షలు పవన్ కళ్యాణ్ గారు అలాగే త్రివిక్రమ్ గారు హాస్పిటల్ కి వెళ్లి సాయి ధరమ్ తేజ్ గురించీ డాక్టర్స్ అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ గారు స్పృహలోకి వచ్చారు అని తెలుస్తుంది. అపోలో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తొందరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. సినీ ప్రముఖలు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు వరుణ్ తేజ్ నీహారిక మరి కొంత మంది అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.

Exit mobile version